18 March, 2026 | 4:14 AM

ముస్లింలకు రంజాన్ తోఫా కిట్ల పంపిణీ

18-03-2026 01:09 AM

మేడ్చల్ అర్బన్, మార్చి 17 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు అందజేస్తున్న రంజాన్ తోఫా కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం మేడ్చల్ పట్టణంలోని ముస్లింల కమ్యూనిటీ హాల్ వద్ద నిర్వహించారు. పట్టణంలోని జిందా షా మదార్ దర్గా మసీదు ఆధ్వర్యంలో ఈ కీట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.

అనంతరం ముస్లింలకు కిట్లను అందజేశారు. ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ప్రతి నిరుపేద ముస్లిం కుటుంబం పండుగ జరుపుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం  రంజాన్ తోఫాలను పంచుతోందని తెలిపారు.  మేడ్చల్ సర్కిల్ పరిధిలోని మూడు డివిజన్ల లో మసీదులకు ఇఫ్తార్ విందు కోసం ప్రభుత్వం తరఫునుంచి డబ్బులు మంజూరు చేసా మని తెలిపారు.

కార్యక్రమంలో  మున్సిపల్ మాజీ వాయిస్ చైర్మన్  సి రమేష్,మాజీ కౌన్సిలర్లు కౌడే మహేష్,మణికంఠ గౌడ్,దేవరాజ్, చాపరాజు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివ శంకర్ ముదిరాజ్,కాంగ్రెస్ నాయకులు బాల్ రెడ్డి, రాఘవేందర్ గౌడ్ సంతోష్ గౌడ్ మల్లేష్ గౌడ్ రామన్న గారి రఘు మైనారిటీ నాయకులు సయ్యద్ లాయక్ అలీ, మహబూబ్ అలీ ఎండి రఫీక్, ఎండి ఆరిఫ్,ఎండి జమాల్, సయ్యద్ ఇనాయత్ అలీ , ఎండి కాలేద్ తదితరులు పాల్గొన్నారు.