విపత్తు ప్రమాదాలపై కలెక్టరేట్ ఆవరణలో మాక్ డ్రిల్
మేడ్చల్, మార్చి 17 (విజయ క్రాంతి): కర్మాగారాలలో, పరిశ్రమలలో అకస్మాత్తుగా జరిగే కెమికల్ బ్లాస్ట్,లీకేజీ, ఏవైన ప్రదేశాలలో బాంబ్ బ్లాస్ట్ లు వంటి ప్రమాదాలు జరిగినపుడు ఆ ప్రాంతాలలో గాయపడిన వారిని కాపాడి, సహాజ పరిస్థితి నెలకొల్పేలా జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) వారి ఆధ్వర్యంలో మంగళవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ లో మాక్ డ్రిల్ నిర్వహించారు.
కెమికల్ బ్లాస్ట్ అయినప్పుడు విడుదలయ్యే వాయు కాలుష్య సాంద్రతను బట్టి అత్యవసరమైన, అవసరమైన మేరకు పరిస్థితులకు అనుగుణంగా సహాజమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి తీసుకునే చర్యలను గురించి మాక్ డ్రిల్ లో ప్రత్యక్షంగా చూపిస్తూ ఎన్డిఆర్‌ఎఫ్ గౌతం కుమార్ వివరించారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఏవిధంగా అత్యవసర చికిత్స అందించడానికి ఏర్పాట్ల గురించి వివరంగా తెలియజేసారు.
ప్రమాదాలు జరిగినప్పుడు చేసే ఫీల్ ఆపరేషన్లలో సంబంధిత శాఖల మధ్య సమన్వయం చాలా ముఖ్యమన్నారు. ప్రమాదాలు జరిగిన చోట సిబ్బంది ఎక్కువ సమయం విధులు నిర్వహించవలసి ఉంటుంది, వారి ఆరోగ్యభద్రత రీత్యా ప్రత్యేక కిట్స్, మాస్కు, డ్రెస్, గ్లౌజులు ధరించి, అవసరమైన మేరకు బాధితులకు అందించి వారిని కాపాడడమే కాకుండా తమను తాము కాపాడుకునే విధానాన్ని ప్రత్యక్షంగా చూపిస్తూ వివంచారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, నివారణ చర్య ల పై ఎన్డిఆర్ ఎఫ్ బృందం అవగాహాన కలిగించారు.
ఈ మాక్ ఎక్స్సజ్ యొక్క దశలవారీ వివరాలను, ఉపయోగించిన క్లోరిన్ అనే రసాయనం గురించి సవివరంగా వివరించారు. ఎన్డిఆర్‌ఎఫ్, అగ్నిమాపక, కర్మాగారాలు మరియు వైద్య విభాగాల సమన్వయంతో మెడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్లో ఈ మాక్ ఎక్స్సజ్ నిర్వహించబడం జరిగిందన్నారు. ఈ మాక్ డ్రిల్ లో జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, అడిషనల్ డిసిపిలు వెంకట్ రెడ్డి, హనుమంతరావు, డిఆర్‌ఓ చంద్రావతి, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీస్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




