అవమానాన్ని భరించ!
- నేను కాంగ్రెస్‌ను వీడాలనే ఆలోచనకు మూలం ఎమ్మెల్యే సంజయే..
- సంజయ్ ఏ పార్టీలో ఉన్నాడు?
- మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
జగిత్యాల, మార్చి 17 (విజయక్రాంతి): జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చర్యల వల్లే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు పెరిగాయని, తాను పార్టీని వీడాలనే ఆలోచనకు మూలకారణం ఆయనేనని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఏ పార్టీలో ఉన్నాడో ముందు తెలుసుకోవాలని ఆ తర్వాత కలిసి పనిచేయడం గురించి ఆలోచిద్దామని అన్నారు.
తాను కాంగ్రెస్ పార్టీని వీడాలని కోరుకోవడం లేద ని, నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని ఎవ్వరూ సులభంగా వదులుకోరని అన్నా రు. అయితే పార్టీని వీడే పరిస్థితి రావడానికి ప్రధాన కారణం సంజయ్ కుమారేనని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు ప్రభుత్వంతో కలిసి పనిచేయడం సహజమని, కానీ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అనైతికమని విమర్శించారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయం లో కూడా కేసీఆర్‌తో కలిసి పనిచేశానని, ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేశానని గుర్తుచేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరగలేదని, సంజయ్ జోక్యం వల్లే పార్టీ బలహీనపడిందని ఆరోపించారు. జగిత్యాలలో గతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నదని, 2019 మినహా అన్ని ఎన్నికల్లో విజయం సాధించిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోకి ఉడుము లాగా వ చ్చి చిచ్చు పెట్టడమే కాకుండా నిబంధనలు ఉల్లంఘించుకుంటూ తమకు నీతులు చెప్ప టం ఏమిటి అని నిలదీశారు.
తాను ఎక్కడ ఉన్న అంకిత భావంతో చేస్తానని ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే ఉండాలని కోరుకుంటున్నాను అని, అయితే అది కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. రైతులు, కార్మికులు, మహిళల హక్కుల కోసం తాను ఎప్పటికీ పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. అక్రమ నిర్మాణాల తొలగింపు, పెట్రోల్ బంక్ ఆక్రమ ణలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో గౌరవం ముఖ్యమని, అవమానాన్ని భరించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. పార్టీ లోపలి సమస్యల పరిష్కారం కోసం అధిష్ఠానం కూడా బాధ్యత వ హించాల్సిన అవసరం ఉందన్నారు.
తాను ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే ఉన్నానని, పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని చెప్పారు. పార్టీకి దూరంగా ఉండే కొంతమం ది ఎమ్మెల్యేలను వేరుచేయాలని సూచించారు. శ్రీరామనవమిని దృష్టిలో ఉంచుకొ ని పాత ఫ్లెక్సీలు తొలగించి, కొత్త ఫ్లెక్సీ ఏర్పాటుచేశామని తెలిపారు. ఈ కార్యక్రమం లో కొత్త ప్రతాప్, కళ్ల పెళ్లి దుర్గయ్య,బండ శంకర్, గుండా మధు, నేహాల్,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.




