14 August, 2026 | 7:37 PM

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

14-08-2026 07:03 PM

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి,(విజయక్రాంతి): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో 1,39,116 పివిసి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి స్మార్ట్ కార్డు అందేలా ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేపట్టాలని సూచించారు.

జిల్లా స్థాయిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించనున్నారని తెలిపారు. అనంతరం అన్ని మండలాల్లో పంపిణీ చేపట్టి, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటలకు ఐడిఓసి కార్యాలయంలో పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.