విద్యార్థులకు యూనిఫారాల పంపిణీ
14-08-2026 07:05 PM
కోదాడ,(విజయక్రాంతి): దోరకుంట గ్రామంలోని ఎస్సీ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ప్రభుత్వం నుండి వచ్చిన యూనిఫామ్స్‌ను సర్పంచ్ పాలకి సురేష్ శుక్రవారం విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మన గ్రామంలో మహిళలకు కుట్టు మిషన్ కేంద్రం ద్వారా స్వయం సహాయక సంఘం మహిళలకు ప్రభుత్వ స్కూళ్లకు యూనిఫాం కుట్టి ఉపాధి కల్పించినట్లు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలోఏపీఎం వెంకయ్య, సిసి లు చిన్న ,పరిమళ వీఓఏ నీలవేణి, ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు,వార్డ్ మెంబర్ పాలడుగు జాన్, కాస్పరాజు సురేష్, నాగేంద్రబాబు, సైదులు పాల్గొన్నారు.






