14 August, 2026 | 7:46 PM

ఆసరా పథకంలో బీడీ కార్మికులకు అవకాశం ఇవ్వండి

14-08-2026 07:13 PM

నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆసరా పెన్షన్లను మంజూరు చేసేందుకు బీడీ కార్మికులకు కూడా అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రతినిధులు శుక్రవారం హైదరాబాద్ లో ప్రజా భవన్ లో వినతిపత్రం అందించినట్టు జిల్లా నేతలు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిందని దాని నెరవేరచాలని వారు ప్రభుత్వానికి విన్నవించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాజన్న బక్కన్న పద్మ గఫూర్ తదితరులు ఉన్నారు.