7 April, 2026 | 2:38 AM

విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

07-04-2026 12:37 AM

మేడ్చల్ అర్బన్ ఏప్రిల్ 6(ఉదయక్రాంతి):ఎల్లంపేట్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 150 మంది విద్యార్థులకు  బిజెపి కౌన్సిలర్ వచ్ పల్లి అర్చన శ్రీనివాస్ ముదిరాజ్  పరీక్షల ప్యాడ్స్,కాంపాక్స్ మెటీరియల్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

ఈ నేపథ్యంలోపేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారని అలాంటి పాఠశాలలో పేద విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి చేరుకొని తల్లి దండ్రులకు ఉపాధ్యాయులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్ సూచించారు.

ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాల గురించి తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా సహకారం అందిస్తానని ఆమె హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాఠశాల విశ్రాంత ఉపాధ్యాయులు హనుమంత్ రావు.6 వ వార్డు మహేశ్వరి రాజేష్ హాజరయ్యారు. పాఠశాల చైర్మన్ జ్యోతి.పాఠశాల ప్రధానోపాధ్యాయులు కవిత.బిజెపి సీనియర్ నాయకులు వచ్ పల్లి శ్రీనివాస్ ముదిరాజ్ హేమలత తదితరులు పాల్గొన్నారు.