7 April, 2026 | 2:34 AM

వైభవంగా రేజోనెన్స్ వార్షికోత్సవం

07-04-2026 12:39 AM

శ్రీనివాస నగర్‌లో రెసో రాక్జ్ 2026 పేరిట నిర్వహణ  

ఖమ్మం, ఏప్రిల్ ౬(విజయక్రాంతి): ఖమ్మం నగరంలోని శ్రీనివాస్ నగర్ గల రేజోనెన్స్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ‘రెసో రాక్జ్ -2026’ పేరిట అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఖమ్మం అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఖమ్మం జి ప్రసాద్ రావు విచ్చేసి పాఠశాల చైర్మన్ ఆర్‌వీ నాగేంద్ర కుమార్, డైరెక్టర్ నీలిమతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు వివిధ రకాల సాంస్కృతిక, సృజనాత్మక కళలను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి జి ప్రసాద్ రావు మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు అనేది ప్రాథమికంగా తల్లిదండ్రుల ప్రోత్సాహంపైనే ఆధారపడి ఉంటుం దని, వారు బాగుంటేనే పిల్లల జీవితాలు బా గుంటాయని ఉద్ఘాటించారు.చదువును కష్టపడి కాకుండా, ఇష్టపడి చదవాలి అని సూచించారు. రేజోనెన్స్ వంటి గొప్ప విద్యాసంస్థలు పిల్లల లక్ష్య సాధన లో కీలక పాత్ర పోషిస్తాయని, విద్యార్థుల సర్వ తోముఖాభివృద్ధికి రేజోనెన్స్ ఒక ‘రైట్ ఛాయిస్’ అని పాఠశాల విశిష్టతను కొనియాడారు.

చైర్మన్ ఆర్‌వీ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ రేజోనెన్స్ కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, విద్యార్ధుల్లోని సృజనాత్మకతను వెలికితీయడమే లక్ష్యంగా పనిచే స్తోందన్నారు. డైరెక్టర్ నీలిమ మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యే ఉత్తమ పౌరులను తీర్చిదిద్దుతుంది.తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ప్రతి విద్యార్థిని ఒక ఆణిముత్యంలా తీర్చిదిద్దడమే మా ధ్యేయం అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు.