4 July, 2026 | 1:51 AM

అధిక దిగుబడే లక్ష్యంగా అధిక సాంద్ర పద్ధతి

04-07-2026 01:12 AM

రైతులకు సబ్సిడీ పత్తి, కంది విత్తనాల పంపిణీ, అవగాహన

గజ్వేల్, జూలై 3: జాతీయ పత్తి సాగు మిషన్, ఆత్మనిర్భర్ భారత్ మిషన్ కింద గజ్వేల్ రైతు వేదికలో 100 శాతం సబ్సిడీపై పత్తి విత్తనాలు, 50 శాతం సబ్సిడీపై కంది విత్తనాలను గజ్వేల్ ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, ఏడీఏ బాబు నాయక్ రైతులకు అందజేశారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేస్తే సాధారణ సాగుతో పోలిస్తే 3040 శాతం వరకు అధిక దిగుబడి సాధించే అవకాశం ఉందని రైతులకు వివరించారు. ఈ పద్ధతులు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ నాగరాజు, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు అశోక్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు సుకేందర్ రెడ్డి, అంజయ్య యాదవ్, రాజా రెడ్డి, గోపాల్ రెడ్డి, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.