calender_icon.png 22 January, 2026 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిబ్బందికి టీ షర్ట్‌లు పంపిణీ

21-01-2026 12:00:00 AM

ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

ముషీరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): ప్రతి వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం అంకిత భావంతో పనిచేస్తున్న జిహెచ్‌ఎంసి ఫీల్ సిబ్బంది సేవలు అభినందనీయమని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. జీహెచ్‌ఎంసీ, నారెడ్కో  ఆధ్వర్యంలో మంగళవారం అంబర్పేట్ అసెంబ్లీ  నియోజకవర్గానికి చెందిన జీహెచ్‌ఎంసీ ఫీల్ సిబ్బందికి శీతాకాల హూడీలు(టీ షర్ట్స) పంపిణీ కార్యక్రమాన్ని అంబర్పేట్ ఎంసిహెచ్ గ్రౌండ్స్లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంతో జిహెచ్‌ఎంసి సిబ్బందికి ఉత్సాహం ప్రోత్సాహం నింపుతుందని  పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు పద్మ వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్ గౌడ్, వై. అమృత, కన్నా ఉమా రమేష్ యాదవ్, జిహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ మారుతి దివాకర్, నారెడ్కో అధ్యక్షులు విజయ్ సాయి, మేఘ  తదితరులు  పాల్గొన్నారు.