21-01-2026 12:00:00 AM
బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్
ముషీరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఇంజి నీరింగ్ విద్యలో బీసీ విద్యార్థులకు అన్యాయంగా మారిన 10 వేల ర్యాంకు నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం జాతీయ కమిటి ఆధ్వర్యంలో మంగళవారం బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్బంగా విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ హామి ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభత్వం ఏర్పడ్డ సంవత్సరంలోపే విద్యార్థులకు పూర్తి బకాయిలు చెల్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ వర్గాలకు చెందిన పేద మధ్య తరగతి విద్యార్థుల స్కాలర్ షిప్, రీయింబర్స్ మెంట్ రూ. 5, 600 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీల విద్యా ఉపాధి రంగాలలో ప్రాధాన్యం కల్పించేలా తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తం గా నిరసన కార్యక్రమం చేపడతామని ఆ యన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షడు కనకాల శ్యామ్ కుర్మా, జిల్లా అధ్యక్షుడు ఇంద్రం రజక, మహిళా నాయకురాలు సంధ్య, సురేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.