21-01-2026 12:00:00 AM
రాఘవేంద్ర హోటల్స్ ఎండీ నందకిషోర్ గుప్తా
బంజారాహిల్స్, జనవరి 20 (విజయక్రాంతి) : వినియోగదారులకు అత్యుత్తమ సేవలకు అందిస్తున్నందుకు తమ సంస్థకు లెగసి రెస్టారెంట్ చైన్ అవార్డు దక్కిందని శ్రీ రాఘవేంద్ర కిచెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సోమ నందకిషోర్ గుప్తా అన్నారు. హైటెక్స్ లో జరుగుతున్న ఫ్రాంచైజ్ ఇండియా తెలంగాణ-ఏపీ ఎడిషన్ 2025 కార్యక్రమంలో అవార్డును అందుకున్నామని తెలియజేశారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ అమేయి మరాతే కన్సల్టింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అమేయి మరాతే, క్రీమ్ స్టోన్ ఐస్ క్రీం కాన్సెప్ట్ సీఈఓ శీతల్ చేతుల మీదుగా అవార్డును గ్రహించామన్నారు.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రాల్లో శ్రీ రాఘవేంద్ర హోటల్స్ పేరిట సుమారు 67 రెస్టారెంట్లను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ప్రతిచోట ఉత్తమ సేవల ను అందిస్తున్నామని పేర్కొన్నారు. అందుకు గానూ అవార్డును ఫ్రాంచైజీ ఇం డియా ప్రకటించిందని తెలియజేశారు. హైదరాబాద్ లో ప్రారంభమైన శ్రీ రాఘవేంద్ర హోటల్స్ ప్రయాణం దేశవ్యాప్తంగా విస్తరిస్తోందన్నారు. రుచికరమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించడంలో పేరు గడించిందని వివరించారు. సంస్థకు ఈ గౌరవం దక్కడం వెనుక హోటల్స్ లో పని చేస్తున్న ప్రతిఒక్కరూ భాగస్వాములేనని ప్రకటించారు. భవిష్యత్తులో మరింత ఉత్తమ సేవలను అందించడానికి ఈ అవార్డు ప్రోత్సాహాన్ని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు.