2 April, 2026 | 3:20 AM

మూడు నెలల రేషన్ పంపిణీ

02-04-2026 12:00 AM

నిర్మల్ ఏప్రిల్ 1 (విజయక్రాంతి) : నిర్మల్ మున్సిపాలిటీలో పేద ప్రజలకు ప్రభుత్వం అందించే మూడు నెలల రేషన్ పంపిణీ కార్యక్రమం మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి ప్రారంభించారు. పట్టణంలోని గుల్లపేట వార్డులో రేషన్ పంపిణీ చేశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ వెలుగు సుధాకర్ స్థానిక నాయకులు కార్యకర్తలు ఉన్నారు.