14 July, 2026 | 4:46 PM

Breaking News

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •  

కార్మిక చట్టాలను రద్దు చేస్తే సహించేది లేదు

02-04-2026 12:00 AM

ఎర్రుపాలెం సెంటర్‌లో కార్మికుల ధర్నా

ఎర్రుపాలెం ఏప్రిల్ 1 (విజయ క్రాంతి):  కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేస్తే సహించేది లేదని సిఐటియు జిల్లా నాయకలు మద్దాల ప్రభాకరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మండల కేంద్రమైన ఎర్రుపాలెం రింగ్ సెంటర్ నందు గ్రామ పంచాయతీ కార్మికులు, ఆశా కార్యకర్తలు, మధ్యాహ్నం భోజన కార్మికులు, వివిధ రంగాలకు సంబంధించిన పలువురు కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి  నిరసన తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో లేబర్ కోడ్ లను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కో ఆర్గనైజేషన్ దూదిగం బసవయ్య, బేతి శ్రీనివాసరావు, నండ్రు సుధారాణి, హైమావతి, విజయలక్ష్మి, శ్రీను,రామకృష్ణ, పుల్లారావు, నగేష్ పాల్గొన్నారు

నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు  చేయాలని సీఐటీయూ నిరసన

పెనుబల్లి. ఏప్రిల్ 1  (విజయక్రాంతి ): కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ సంస్థలకు పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ మొత్తం కార్మిక వర్గానికి హాని చేసే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్ రావు రావు డిమాండ్ చేశారు. బుధవారం పెనుబల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రం వి.ఎం.బంజర్ రింగ్ సెంటర్ వద్ద నిరసన చేపట్టారు. 

విద్యుత్ ప్రైవేటీకరణ ఆపు చేయాలని, ప్రభుత్వమే విద్యుత్ సంస్థలు నడపాలని, డిమాండ్ చేశారు. నిరసన ప్రదర్శనలో హమాలి యూనియన్, రిక్షా కార్మికులు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్,  వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం నాయకులు, గాయం తిరుపతిరావు, తడికమళ్ళ చిరంజీవి, చిట్టి మొదల కృష్ణ, మిట్టపల్లి నాగమణి, తాండ్ర రాజేశ్వరరావు, బాజీ,మిద్దె.స్వామి, అన్నపరెడ్డి. లక్ష్మయ్య, నాగయ్య, రాములు, చెన్నారావు పాల్గొన్నారు.