25 February, 2026 | 2:25 AM

ఉపాధి కూలీలకు పనిముట్ల పంపిణీ

25-02-2026 12:50 AM

ములకలపల్లి, ఫిబ్రవరి 24, (విజయక్రాంతి): ఉపాధి హామీ కూలీలకు మంగళవారం పనిముట్లు పంపిణీ చేశారు. ములకలపల్లి మండలంలోని సీతారాంపురం పంచాయతీ ఆనందపురం అన్నారం చింతలపాలెం గ్రామాల్లో వాది హామీ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులలో పాల్గొనే కూలీలకు ప్రభుత్వం సరఫరా చేసిన పలుగులు, పారలు, గమాళాలు సీతారాంపురం గ్రామ సర్పంచి కుంజా రవి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఫీల్ అసిస్టెంట్ తాటి ప్రసాద్,మేట్స్ శాంతి, అనూష,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.