calender_icon.png 17 June, 2025 | 12:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమిష్టి కృషితోనే జిల్లా అభివృద్ధి

16-06-2025 05:54:26 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కలెక్టరుగా అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అధికారుల సమక్షంలో కలెక్టర్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములవ్వాలన్నారు. ప్రజలకు ప్రభావవంతమైన సేవలందించడమే మన లక్ష్యంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లు పైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.