16-06-2025 05:51:29 PM
మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్రంలోని ఆదిలాబాద్, హాకీంపేట్, కరీంనగర్, ప్రభుత్వ క్రీడ పాఠశాలలో నాలుగో తరగతిలో ప్రవేశాల కొరకు మండల స్థాయి క్రీడా పోటీల(Mandal level sports competitions)ను ఈనెల 18న పట్టణంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో నిర్వహించడం జరుగుతుందని మండల విద్యాధికారి దత్తుమూర్తి(Mandal Education Officer Dattamurthy) తెలిపారు. క్రీడా పాఠశాలలో ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని. దరఖాస్తు ఫారం పోటీలు జరిగే రోజున వెంట తీసుకొని రావాలని సూచించారు.
3వ తరగతి పూర్తి చేసిన విద్యార్హత ప్రోగ్రెస్ రిపోర్టు, జనన, ఆధార్, కుల దృవీకరణ పత్రాలతో క్రీడా పోటీలకు హాజరుకావాలన్నారు. విద్యార్థులు 31.08.2017 నుండి 01.09.2018 మధ్య జన్మించిన వారై ఉండాలని, ఎత్తు బరువుతో పాటు, శారీరక పరీక్షల్లో 15 మార్కులు పైన వచ్చిన విద్యార్థులు అర్హులని ఆయన వివరించారు. అర్హులైన, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.