calender_icon.png 17 November, 2025 | 8:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రుల సహకారంతో జిల్లా అభివృద్ధి

17-11-2025 12:12:42 AM

ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో సేద తీరనున్న భక్తులు: మంత్రి సీతక్క

ములుగు,నవంబరు16(విజయక్రాంతి):ములుగు జిల్లా సమీపంలోని గట్టమ్మగుట్ట వద్ద నిర్మించనున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేదతీరే అవకాశం ఉందని, తల్లికి తలవంచందే భక్తులు ముందు కదలరని రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క అన్నారు.

జిల్లా కేంద్రంలోని ఆదివారం ఘట్టమ్మ తల్లి దేవాలయం వద్ద 45లక్షల రూపాయలతో నిర్మించి తలపెట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులను కలెక్టర్ దివాకర్ టి.ఎస్., గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవిచంద్రర్ లతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,రాష్ట్ర మంత్రులు బట్టి విక్రమార్క,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని, దీనిలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని వివరించారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే భక్తులు, పర్యాటకులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకున్న అనంతరమే ముందు సాగుతారని, జాతీయ రహదారి ఆనుకొని ఉన్న గట్టమ్మ తల్లి ఆలయం వద్ద అన్ని సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గట్టమ్మ తల్లిని దర్శించుకున్న అనంతరం భక్తులు సేద తీర్చడానికి అనేక స్థలాలు ఉన్నాయని, నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జికి నిధులు సరిపోను పక్షంలో అదనపు నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.