16 April, 2026 | 5:55 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం

16-04-2026 04:27 PM

డీ ఎల్ పీ ఓ  సురేష్ బాబు 

పాపన్నపేట,ఏప్రిల్16: గ్రామాల అభివృద్ధికి అధికారులు, నూతన సర్పంచులు సమన్వయంతో పనిచేయాలని, సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని డీఎల్ పీ వో సురేష్ బాబు పేర్కొన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల స్థాయి సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో విద్యుత్, నీటి సమస్యలు పరిష్కరించాలని సర్పంచులు అధికారులను కోరారు. అరైవ్ - అలైవ్ లో భాగంగా ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలన్నారు. గ్రామ ప్రథమ పౌరులైన సర్పంచులు గ్రామ ప్రజలకు ఈ విషయంపై అవగాహన కల్పించి, రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీఓ విష్ణువర్ధన్, మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.