16 April, 2026 | 6:05 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం

16-04-2026 04:25 PM

బోత్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పై మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులతో గురువారం సమావేశం నిర్వహించారు మండల కేంద్రాల్లో నిర్వహించిన కార్యక్రమాల లో ఆయా మండలాల ఎంపీడీవోలు రమేష్ మహేందర్ తహసిల్దార్లు సుభాష్ చంద్ర మల్లేష్ లతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొని నివేదికలను సభలో వినిపించారు. ప్రభుత్వం 99 రోజులపాటు చేపట్టిన కార్యక్రమంలో గ్రామాల వారి చేపట్టిన పనులను నివేదించారు ఈ సందర్భంగా బోత్ లో ఏర్పాటైన కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ జి.రాజు యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేర్చడం జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు.

అధికారులు గ్రామాల ప్రజలతో మమేకమై ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులో మంజూరి తో పాటుగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రైతుబంధు అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా పూర్తిస్థాయిలో నిలదొక్కు కున్న తర్వాత ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందన్నారు. అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని అయితే ప్రజలు సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలన్నారు సమావేశంలో ఆయా మండలాల వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ఎంపీఈవోలు ఐసిడిఎస్ అంగన్వాడి ఆశ పంచాయతీ రాజ్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు