28 June, 2026 | 12:24 PM

Breaking News

పోలియో రహిత సమాజ నిర్మాణం అందరి బాధ్యత   •   పసిపిల్లల ఆరోగ్యానికి ఆ రెండు చుక్కలే రక్ష   •   సీసీ కెమెరాలతో గ్రామంలో పటిష్టమైన భద్రత   •   రోజువారి కూలీల జేబుకు చిల్లు పెడుతున్న మద్యం మాఫియా   •   రేవంత్ రెడ్డి నల్లగొండ సభ వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్   •   ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి   •   రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం   •   పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి   •   పి.వి. నరసింహారావుకి నివాళులర్పించిన కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ   •   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి   •  

ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి

16-04-2026 04:32 PM

లక్ష్మణ చందా (విజయ క్రాంతి) : ముదిరాజుల సంక్షేమానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ముదిరాజ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నిర్మల్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొత్తపల్లి రఘునాథ్ మ దర్శనం దేవేందర్ లు తెలిపారు . స్థానిక టీఎన్జీవో భవన్ లో, ఈ మధ్యకాలంలో డాక్టరేట్ పట్టాలు పొందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మరియు వివిధ ఉపాధ్యాయ సంఘాల జిల్లా బాధ్యులుగా బాధ్యతలు స్వీకరించిన నాయకులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, వారిని ఘనంగా సత్కరించారు.

ఎలాంటి ప్రభుత్వ ప్రోత్సాహం లభించనప్పటికీ, ముదిరాజులు స్వశక్తితో పలు రంగాల్లో రాణిస్తున్నారని, అలాంటి వారిని మరింత ప్రోత్సహించి, వారి అభివృద్ధికి చేయుతనoదించడానికి ముదిరాజ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ముందుండాలని వారు ఆకాంక్షించారు. నిర్మల్ జిల్లా ముదిరాజ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో అసోసియేట్ ప్రొఫెసర్ గంగాధర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కొత్తపల్లి రఘునాథ్, పవన్ కుమార్, దర్శనం దేవేందర్ మరియు గోనెల శశిరాజ్ లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సోలాపూర్ రాజేశ్వర్, మొగిలి రాములు, పందెన లక్ష్మణ్ ,శ్రీనివాస్, హనుమాoడ్లు, పురుషోత్తం, మోహన్, శ్రీధర్, రవి, వినోద్ కుమార్ మొదలగువారు పాల్గొన్నారు.