25 July, 2026 | 2:24 PM

వనదుర్గమ్మను దర్శించుకున్న జిల్లా విద్యాధికారి

25-07-2026 01:53 PM

పాపన్నపేట,జూలై25: మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారి రాజు శనివారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొట్టమొదటిసారిగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట అక్షయ పాత్ర మెదక్ ప్లాంట్ మేనేజర్ త్రిపాఠి, పవన్ కుమార్, రాకేష్ కుమార్, భట్టు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.