30 July, 2026 | 7:45 PM

ఓట్ల లెక్కింపులో పారదర్శకత పాటించాలి

29-05-2024 01:00 AM

యాదాద్రి భువనగిరి, మే 28 (విజయక్రాంతి): భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో పారదర్శకత పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హను మంత్ కే జండగే అన్నారు. ఓట్ల లెక్కింపుపై కలెక్టరేట్ సమావేశపు హాల్‌లో మంగళవారం సూపర్‌వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్ల కు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలోనే ఈవీఎంల సీల్ ఓపెన్ చేయాలని, పోలైన ఓట్లను అభ్యర్థుల వారీగా ప్రదర్శించాలని సూచించారు. అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కే గంగాధర్, మాస్టర్ ట్రైనర్ కే నర్సిరెడ్డి, హరినాథ్ రెడ్డి, జడ్పీ సీఈవో శోభారాణి, డీఈవో నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.