30 July, 2026 | 6:49 PM

3 రోజుల కస్టడీకి ఉమామహేశ్వర్‌రావు

29-05-2024 01:02 AM

అక్రమాస్తుల కేసులో విచారించనున్న ఏసీబీ 

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 28 (విజయక్రాంతి): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టుయి రిమాండ్‌లో ఉన్న సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును మూడు రోజులపాటు ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. సీసీఎస్‌లో ఏసీపీగా ఆయన పర్యవేక్షించిన కేసులు, వాటి ద్వారా చేసిన వసూళ్లపై ఏసీబీ ప్రశ్నించే అవకాశం ఉన్నది. హై ప్రొఫైల్ కేసుల్లో అత్యధికంగా సెటిల్మెం ట్లు చేసేందుకే ఉమామహేశ్వర్ రావు టీం ప్రయత్నించినట్టు ఏసీబీకి ఫిర్యాదులు అం దాయి. కేసుల విచారణలో కోట్ల రూపాయా లు చేతులు మారినట్టు అనుమానిస్తునారు. ఉమామహేశ్వర్‌రావుకు కొంతమంది సహకరించినట్టు ఏసీబీ వద్ద ఆధారాలు ఉన్నట్టు గా తెలుస్తున్నది. దీంతో ఆయనను బుధవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.