14-02-2026 07:37:20 PM
కోదాడ,(విజయక్రాంతి): మండల పరిధిలోని కూచుపూడి తండా గ్రామంలో ఉన్న శ్రీ స్వయంభూ అయ్యప్ప స్వామి దేవాలయం, శ్రీ సీతారాముల స్వామి దేవాలయం, బొడ్రాయి అమ్మవారిని ప్రతిష్టాపనకు నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పాల పొంగల్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ గ్రామ శాంతి, పంటల అభివృద్ధి, ఆరోగ్యం కోసం భక్తి శ్రద్ధలతో పాలపొంగుళ్లు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నాయకులు పాల్గొన్నారూ.