16 April, 2026 | 6:10 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

జిల్లా వ్యాప్తంగా ముమ్మర తనిఖీలలో 11 లక్షల 50 వేలు నగదు స్వాధీనం

29-11-2025 10:16 PM

వాహన తనిఖీలలో 11 లక్షల 50 వేల  అనుమానాస్పద నగదు స్వాధీనం..

ఎన్నికల సమయంలో 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే సీజ్..

గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల దృష్ట్యా జిల్లా పోలీసులు విస్తృత తనిఖీలు..

జిల్లా ఎస్పీ సునిత రెడ్డి..

వనపర్తి క్రైమ్: ఎన్నికల సమయంలో నగదు, మద్యం, విలువైన వస్తువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామని జిల్లా సరిహద్దు ప్రతి చెక్‌పోస్ట్ లలో ప్రత్యేక బృందాలతో అక్రమ రవాణా, డబ్బు పంపకాలు, ఎన్నికల ప్రభావితం ప్రయత్నాలపై ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి అన్నారు. శనివారం గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తూ, వాహనాల తనిఖీల్లో అనుమానాస్పదంగా తీసుకెళ్తున్న రూ 11,50,000/- నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారని ఎస్పీ తెలిపారు. 

ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికల ప్రక్రియను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని ప్రజాస్వామ్యాన్ని డబ్బుతో ప్రభావితం చేసే ఏ ప్రయత్నాన్నీ సహించమని ఎన్నికల సమయంలో ఎవరూ రూ.50,000 కంటే ఎక్కువ నగదును తమతో తీసుకెళ్లరాదని అంతకంటే ఎక్కువ నగదు మోహిస్తే దాని మూలం, గమ్యం స్పష్టమైన ఆధారాలతో నిరుపించాలని లేదంటే ఆ మొత్తాన్ని తక్షణమే స్వాధీనం చేసి, ఎన్నికల నియమావళి ప్రకారం చట్టపరమైన చర్యలు చేపడతామని జిల్లా అంతటా కఠిన తనిఖీలు కొనసాగుతున్న నేపథ్యంలో, అవసరం లేకుండా భారీ నగదు మోయడం పూర్తిగా నిషేధితం. అనుమానాస్పద నగదు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడానికి చేసిన ప్రయత్నంగా పరిగణిస్తామని ఎస్పీ తెలిపారు. జిల్లా ప్రజలకు, ఓటర్లు ఎన్నికల సమయంలో ఎవరైనా అనుమానాస్పదంగా డబ్బు పంపిణీ, రవాణా, ప్రలోభాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచి తక్షణ చర్యలు తీసుకుంటాం. శాంతియుత–పారదర్శక ఎన్నికలకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఎస్పీ సూచించారు.