10 June, 2026 | 3:00 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

పొలిటికల్ అఫైర్స్ జిల్లా కమిటీ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారబోతుంది

09-04-2026 11:35 AM

డోర్నకల్- గద్వాల లైన్ పూర్తి కాకపోతే ఎమ్మెల్యేలతో కలిసి పాదయాత్ర చేపడతా

డిసిసి అధ్యక్షులు శివసేన రెడ్డి

వనపర్తి,(విజయక్రాంతి): పొలిటికల్ అఫైర్స్ కమిటీ అత్యంత కీలకమైన ,పటిష్టమైన వ్యూహంతో నిర్ణయాధికారంగా అధిష్టానం లో పనిచేస్తుందని, అలాంటి  పొలిటికల్ అఫైర్స్ కమిటీని జిల్లాలో ఏర్పాటు చేయడంతో జిల్లాస్థాయిలో ప్రతిష్టాత్మకంగా మారబోతుందని డిసిసి అధ్యక్షులు శివసేన రెడ్డి అన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో  పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిలుగా రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడా యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల్ల చిన్నారెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిలతో కలిసి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డిలు హాజరై పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి మాట్లాడుతూ... పొలిటికల్ అఫైర్స్ కమిటీ జిల్లాలో ఏర్పాటు చేయడం క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసినందుకు శుభపరిమానానికి దోహదపడుతుందన్నారు. అలాగే ఎప్పటికప్పుడు రాజకీయ పరిస్థితులపై సమర్పించడం పార్టీ ఆచూరించాల్సిన వ్యూహాలను కమిటీ ఖరారు చేస్తుందన్నారు. ఈ ఎన్నికలు వచ్చినా టికెట్లు కేటాయింపు రిజర్వేషన్లు వంటి అంశాలపై కీలక నిర్ణయాలపై పార్టీ అంతర్గత వ్యూహరచన, అలాగే సీనియర్ నాయకుల అనుభవాన్ని ఉపయోగించుకుని వారిని భాగస్వామ్యం చేసినందుకు, అధిష్టానం ఆదేశాల మేరకు పొలిటికల్ అఫైర్స్ జిల్లా కమిటీ వేదికగా పనిచేస్తుందన్నారు. 

డోర్నకల్- గద్వాల లైన్ పూర్తి కాకపోతే  ఎమ్మెల్యేలతో కలిసి పాదయాత్ర చేపడతా: మల్లు రవి 

డోర్నకల్- గద్వాల రైల్వే లైన్ నాగర్ కర్నూల్ వనపర్తి తో పాటు పలు ప్రాంతాల ప్రజల చిరకాల వాంఛ అని నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లు రవి  అన్నారు. ఈ రైల్వే ఏర్పాటు కోసం ఎంతగానో నిరంతరం శ్రమిస్తున్నానన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి రైల్వే లైన్ ను సంపూర్ణంగా పూర్తి చేయాలన్నారు. స్పందించలేనిపక్షంలో సర్వే చేసిన ప్రాంతాలలోనే ఎమ్మెల్యేలతో కలిసి పాదయాత్ర చేపడతానని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో  మాజీ డిసిసి అధ్యక్షులు శంకర్ ప్రసాద్, రాజేంద్రప్రసాద్ యాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, పెబ్బేరు మున్సిపాలిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఆత్మకూర్ మున్సిపల్ చైర్ పర్సన్ నాగమణి, అమరచింత మున్సిపల్ చైర్పర్సన్ సువర్ణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, కార్యదర్శి విజయలక్ష్మి, ధనలక్ష్మి , కోళ్ల వెంకటేష్, సహదేవు , చంద్రమౌళి పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.