5 June, 2026 | 7:18 PM

ఖానాపూర్లో కోర్టు నిర్మాణానికి స్థలం పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి

05-06-2026 06:05 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో కోర్టు నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని శుక్రవారం నిర్మల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి శ్రీవాణి పరిశీలించారు. పట్టణం కొమరం భీమ్ చౌరస్తాలో గల 110 ఎకరాల్లో కోర్టుకు కేటాయించిన ఐదు ఎకరాల స్థలాన్ని ఆమె పరిశీలించారు. త్వరలోనే కోర్టు నిర్మాణానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.