5 June, 2026 | 6:58 PM

రైతు సేవలో ముందుండాలి

05-06-2026 05:51 PM

బోథ్,(విజయక్రాంతి): బజారత్నూర్ మండల కేంద్రంలో జొన్నల కొనుగోలులో కీలకపాత్ర వహించిన సహకార సంఘం సీఈవో నారాయణ గౌడ్ సిబ్బంది గోపు గోవర్ధన్ ముత్తన్న రాజు కమలాలను రైతులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చు కొని రైతులు తమ పంటలను అమ్ముకునేందుకు రావడం జరిగిందని రైతుల కష్టాలను పరిశీలించిన అధికారులు ఇబ్బందులు కలగకుండా పంటల కొనుగోలను సాఫీగా జరిగేటట్టు చూడడం అభినందనీయమని రైతులు పేర్కొన్నారు. రానున్న భవిష్యత్తులో అధికారులు రైతులకు ఇదే తహరాహా లో సహకారం అందించాలని రైతులు కోరారు . ఎంతో సహనంతో పంటల కొనుగోలుకు సహకరించిన అధికారులను రైతులు శాలువాలతో సన్మానించి అభినందించారు.