16 April, 2026 | 7:48 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ

07-06-2025 05:52 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఈరోజు బక్రీద్ పండుగ(Eid al-Adha) సందర్భంగా జిల్లా ఎస్పీ జి జానకి షర్మిల ఐపిఎస్(District SP G Janaki Sharmila IPS) జిల్లాలోని పలు ప్రాంతాల్లో శాంతి భద్రతలను దగ్గరుండి పర్యవేక్షించారు. ముఖ్యంగా భైంసా పట్టణంలోని ఈద్గాలను మసీదులను సందర్శించి శాంతి భద్రతల విషయంలో ఏ మాత్రము లోటు పాట్లు లేకుండా చూసుకున్నారు. చిన్నారులను, మత పెద్దలలను కలిసి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. 

జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అంతటా ప్రశాంతంగా ఉండే విధంగా చూసుకున్నారు. ట్రాఫిక్, పలు అంశాల గురించి పోలీస్ అధికారులకు క్షుణ్ణంగా ఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ ఏఎస్పి రాజేశ్ మీన ఐపిఎస్, భైంసా ఏఎస్పి అవినాష్ కుమార్ ఐపిఎస్, ఇన్స్పెక్టర్ లు ప్రవీణ్ కుమార్, క్రిష్ణ, గోవర్ధన్, గోపీనాథ్, డి.ఎస్.బి ఇస్పెక్టర్ సమ్మయ్య, ఆర్ ఐ.రామ్ నిరంజన్, ఎస్.ఐ లు, ఆర్.ఎస్.ఐ లు, డాగ్ స్క్వాడ్ బృందం ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు.