దైవానుగ్రహం సన్మార్గం వైపు నడిపిస్తుంది
ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి
రాజాపూర్ జూన్ 24: దేవాలయాలు మన దేశ సంస్కృతి సంప్రదాయాలకు పత్రికలు అని, దైవ అనుగ్రహం సన్మార్గం వైపు నడిపిస్తుందని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. బుధవారం రాజాపూర్ మండలంలోని కుచర్కల్ గ్రామంలో శ్రీ శివపరివారం, రామా పరివారం, నవగ్రహాలు, ధ్వజస్తంభాల నూతన ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో న జడ్చర్ల శాసనసభ్యులు శ్రీ జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాలు, ధార్మిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, ప్రాంతం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని భగవంతుడిని ప్రార్థించారు.
అనంతరం గ్రామ ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆలయాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ఆధ్యాత్మిక కేంద్రాలు సమాజంలో ఐక్యత, సత్సంబంధాలు పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. గ్రామ ప్రజల సహకారంతో ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






