మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం
15-03-2026 05:38 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మండెపల్లి గ్రామంలో నిర్వహించనున్న శ్రీ రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి మండెపల్లి గౌడ సంఘం సభ్యులు కాంగ్రెస్ నాయకులను ఆహ్వానించారు. ఈ నెల 17,18 తేదీల్లో జరగనున్న మహోత్సవానికి సంబంధించి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జిల్లా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను రేణుక ఎల్లమ్మ గడతో ఆహ్వానించారు.




