మా గ్రామాలకు నీళ్లు అందించండి
చేగుంట,(విజయక్రాంతి): దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసినా చేగుంట పలు గ్రామల సర్పంచ్ లు, వారి గ్రామ సమస్యలు, గ్రామాల అభివృద్ధి కొరకు నిధులను, అలాగే మల్లన సాగర్ నుంచి శంకరంపేట కెనాల్ ద్వారా వెళ్తున్న నీటిని ఇందుప్రియల్ గ్రామం వద్ద నుంచి కాసానపల్లి, పోతంపల్లి, పోతన శేట్టిపల్లి, చెట్లతిమ్మాయిపల్లి, చుట్టు పక్క గ్రామాలకు మీదుగా నీరు వచ్చే విధంగా చూడాలని కోరారు.
ఈ కార్యక్రమం లో చేగుంట ఎఎంసి ఛైర్మెన్ తాడేం వెంగళరావు,చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, అప్పాల శేఖర్, కసాన్ పల్లి గ్రామ సర్పంచ్ భిక్య నాయక్, పోతంపల్లి గ్రామ సర్పంచ్ మాధవ రెడ్డి,పోతన శేట్టిపల్లి గ్రామ సర్పంచ్ ప్రశాంత్, చెట్లతిమ్మాయిపల్లి గ్రామ సర్పంచ్ హంశి మనోహర్,నడిమి తండా గ్రామ సర్పంచ్ కేతవత్ రాములు,పెద్ద శివనూర్ గ్రామ సర్పంచ్ నర్సింలు,తదితరులు పాల్గొన్నారు.




