1 April, 2026 | 4:55 PM

బిజినేపల్లి పీహెచ్‌సీలో స్పెషాలిటీ వైద్య శిబిరాలపై డీఎంహెచ్ఓ తనిఖీ

01-04-2026 03:44 PM

బిజినేపల్లి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న స్పెషాలిటీ వైద్య శిబిరాలను జిల్లా ఇంచార్జి వైద్య అధికారి డా. రవి కుమార్ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హెల్త్ మిషన్–99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా గైనకాలజీ, పెడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, డెంటల్, కంటి వైద్య నిపుణులు ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా రోగుల నమోదు, చికిత్స వివరాలు, మందుల పంపిణీ తదితర అంశాలను పరిశీలించిన ఆయన, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా వైద్య సిబ్బంది పనిచేయాలని సూచించారు.