ఉద్యోగులు భద్రత ప్రమాణాలు పాటించాలి
01-04-2026 03:46 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలను అందిస్తామని విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ జాదవ్ సుభాష్ తెలిపారు.. నిర్మల్ జిల్లాలో విద్యుత్ సరఫరా డిమాండ్పై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. విద్యుత్ సిబ్బంది మరమ్మతులు చేసేటప్పుడు తప్పనిసరిగా సేఫ్టీ పరికరాలు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాదాలు జరగకుండా జిల్లాలో ఆన్లైన్ వాట్సాప్ తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ డి ఈ నాగరాజు అధికారులు వెంకటేశ్వర్లు కే శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు




