27 July, 2026 | 12:51 PM

Breaking News

ముత్యాలంపాడు ఎక్స్‌ రోడ్డులో విత్తన మేళా ప్రారంభం   •   రామాలయ కమిటీ చైర్మన్‌పై రాజుకుంటున్న రాజకీయం   •   100 స్తంభాల ఆలయ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలి   •   గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •  

అసంక్రమిత వ్యాధులపై అవగాహన కార్యక్రమం

01-04-2026 03:42 PM

మఠంపల్లి,(విజయ క్రాంతి): ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం భాగంగా మఠంపల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ పరిధిలో అసంక్రమిత వ్యాధులు (Non-Communicable Diseases- NCDs)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మఠంపల్లి సర్పంచ్ ఏసుమల్ల వీరలక్ష్మి పాపయ్య,మఠంపల్లి మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ కళ్యాణి హాజరై మాట్లాడుతూ... అసంక్రమిత వ్యాధులు (మధుమేహం, రక్తపోటు,గుండె సంబంధిత వ్యాధులు వంటి) గురించి అవగాహన కల్పించి,వాటి నివారణకు సరైన ఆహారం, వ్యాయామం,ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి ముఖ్యమైన సూచనలు తెలియాజేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శౌరి,సూపర్వైజర్లు ఏ.రవికుమార్ , కళావతి, కార్యదర్శి వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు,సిబ్బంది, ఎఎన్ఎమ్,ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.