నైపుణ్యాలను పెంచుకోండి: దేవకీ వాసుదేవరావు
ఖమ్మం టౌన్ (విజయక్రాంతి): నైపుణ్యాలు వుంటే ఉద్యోగాలకు కొదవుండదని, బాగా నేర్చుకొని మంచి ఉద్యోగాలు సాధించి స్థిరపడాలని బి జె పి రాష్ట్ర కోశాధికారి దేవకీ వాదేవరావు అన్నారు. బుధవారం ఖమ్మం లోని వైరా రోడ్ లోని వివేకానంద ఇన్స్టిట్యూట్ లో ఇన్ఫోసిస్ సహకారంతో లెర్నెట్ స్కిల్స్ నిర్వహిస్తున్న గీత్ 3.O (శిక్షణ, ఉపాధి) కార్యక్రమానికి అయన ముఖ్య అతిధిగా హాజరై శిక్షణ పొందుతున్న యువతకు దిశా నిర్దేశం చేశారు. డిగ్రీలు పొందిన మీరు ఇటువంటి శిక్షణ అనంతరం మంచి కంపెనీ ల్లో ఉద్యోగాలు పోంది మీరు స్థిరపడి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, మీ రు ఆర్ధికంగా మీ కుటుంబానికి తోడుండాలని అన్నారు. ఈ నెల రోజులు శిక్షనను తపస్సు లా చేయాలనీ సూసించారు. అనంతరం విద్యార్థులకు శిక్షణకు సంబందించిన మెటీరియల్ అందజేశారు. ఈ కార్యక్రమం లో లెర్నెట్ స్కిల్స్ మేనేజర్ మత్తి రామకృష్ణ, ట్రైనర్ లు గోరింట్ల రామకృష్ణ, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.






