నీటి ఎద్దడికి తావు ఉండొద్దు
14-06-2024 12:42 AM
- మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
కామారెడ్డి, జూన్ 13 (విజయక్రాంతి) : కామారెడ్డిలో నీటి ఎద్దడికి తావు ఉండొద్దని మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ ఆదేశించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సాధారణ సమావేశంలో ఆమె మాట్లాడారు. అవసరమైన చోట వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలన్నారు. వానకాలంలో ఎక్కడా వరద నిలువకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, వైస్ చైర్‌పర్సన్ ఉరుదొండ వనిత పాల్గొన్నారు.






