29 July, 2026 | 6:57 PM

అనాధ పిల్లలకు తహసిల్దార్ భరోసా

29-07-2026 06:17 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని రేచిని గ్రామానికి చెందిన భీమ్రావు తిరుపతమ్మ దంపతులు మృతి చెందడంతో అనాధలుగా మారిన వారి పిల్లలను పరామర్శించారు. వారి పిల్లలకు ఆర్థిక సహాయంగా 2000 నగదు, 25 కేజీల బియ్యం అందజేసి మండల విద్యాధికారి సునీత, ప్రిన్సిపల్ అరుణతో పిల్లల చదువు కోసం మాట్లాడారు. అలాగే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారికి అనాధ పిల్లల కోసం లేఖ రాసినట్లు తహసిల్దార్ తెలిపారు.