హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించవద్దు
రౌండ్ టేబుల్ సమావేశంలో నేతల తీర్మానం
నిర్మల్, జులై 5 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదును దేశ రెండవ రాజధానిగా చేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా (యుటి ) చేయాలని కేంద్ర ప్రభుత్వ ఆలోచన వెంటనే విరమించుకోవాలని ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నిర్మల్ పెన్షనర్ల భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ప్రొ. వినాయక్ రెడ్డి మాట్లాడుతూ అన్నారు. హైదరాబాద్ రెండో రాజధాని అయితే తెలంగాణ అభివృద్ధి చెందుతుందనీ, ఇది మొత్తంగా దక్షిణాది అభివృద్ధికి దోహద పడుతుందనీ, సమాఖ్య వ్యవస్థకు పునాదిగా దక్షిణాదికి సమ ప్రాధాన్యం ఇచ్చినట్లు ఉంటుందనే వాదనలు ముందుకు తెస్తున్నారని ఇది తప్పుడు వాదన అని అన్నారు. హైదరాబాదు కేంద్రం ట తన ఆధీనంలోకి తీసుకున్నందుకు జరుగుతుందని ఆరోపించారు.
తెలంగాణకు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ఏపీటీఎఫ్ పూర్వ అధ్యక్షులు కె. వేణుగోపాల్ అన్నారు.నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం సాగింది. రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ప్రజలు ఆ ఫలాలను అందుకునే సమయంలో హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంత ప్రతిపాదన రావడంతో హైదరాబాద్ నుంచి వచ్చే 60% ఆదాయం తెలంగాణ రాష్ట్రం కోల్పోతుందని, ఆవేదన వ్యక్తం చేశారు.
సమావేశం లో న్యూడెమక్రసీ రాష్ట్ర నాయకులు జె. వి. చలపతి రావు టిజెఎసి జిల్లా ఛైర్మన్ ఆరేపల్లి విజయకుమార్ అన్నారు.ఈ సమావేశంలో తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షు లు వాజిద్ అహ్మద్ ఖాన్, మాస్ లైన్ జిల్లా కా ర్యదర్శి కే. రాజన్న, న్యూడెమోక్రసీ జిల్లా కా ర్యదర్శి రాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి యస్ యన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత పోశెట్టి, అజయ్, నాగారామ్, తెలంగాణ షరీఫ్, ఖానాపూర్ నర్సయ్య, అనంతరావు, కాళ్ళ ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు






