చరిత్రను మరవద్దు
- తెలంగాణ విముక్తి పోరాటాన్ని నవతరం తెలుసుకోవాలి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
- రాజ్యసభ సభ్యుడు డా.కె.లక్ష్మణ్
- ‘తెలంగాణ విమోచన దినం’ పుస్తకావిష్కరణ
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): దేశమంతా స్వాతంత్య్ర(Independence) సంబరాల్లో మునిగిన వేళ హైదరాబాద్ సంస్థానం(Hyderabad State) మాత్రం నిజాం నిరంకుశ పాలన(Nizam autocratic rule)లోనే బందీగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు(BJP State President N Ramchander Rao) పేర్కొన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో సాగిన వీరోచిత పోరాటం, త్యాగధనుల చరిత్రను నేటి నవతరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చరిత్రను మరుగున పడనివ్వకుండా విద్యార్థులు, యువతకు వాస్తవాలను తెలియజేయాలని పిలుపునిచ్చారు.
ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జి.లక్ష్మణ్ రచించిన ‘ సెప్టెంబర్ 17 -తెలంగాణ విమోచన దినం(Telangana Liberation Day)’ పుస్తకాన్ని మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎంపీ డా.కె.లక్ష్మణ్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జి.లక్ష్మణ్ తెలంగాణ చరిత్ర(History of Telangana), ఉద్యమాలపై ఇప్పటికే అనేక రచనలు చేసిన గొప్ప అధ్యయనశీలి అని ప్రశంసించారు. తెలంగాణ చరిత్రలోని అనేక లోతైన కోణాలను సుపరిచితం చేశారని కొనియాడారు. నవతరం వాస్తవ చరిత్రను తప్పక తెలుసుకోవాలని కోరారు.
కాంగ్రెస్, బీజేపీలు మజ్లిస్‌కు లొంగాయి : లక్ష్మణ్
తెలంగాణ విమోచన చరిత్రను కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు తొక్కిపెట్టాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే మజ్లిస్‌కు లొంగిపోయి విమోచన చరిత్రను విస్మరిస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విమోచన వేడుకలను నిర్వహించాలన్నా, చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలన్నా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు.
యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేస్తున్న వ్యాఖ్యలను లక్ష్మణ్ ఖండించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఎన్.గౌతంరావు, ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్, తెలంగాణ విమోచన కమిటీ కన్వీనర్ శ్రీవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్‌గాంధే తదితరులు పాల్గొన్నారు.