15 June, 2026 | 1:51 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •  

సెల్ టవర్ ఏర్పాటు చేయొద్దు

24-03-2026 12:18 AM

ఆందోళన చేసిన నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామస్తులు 

బూర్గంపాడు, మార్చి23(విజయక్రాంతి): తమ గ్రామంలో సెల్ టవర్ నిర్మించొద్దంటూ బూర్గంపాడు మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామస్తులు సోమవారం ఆందోళన చేపట్టారు. అంగన్వాడి కేంద్రానికి ఆనుకొని ఇళ్ళ మధ్యలో సెల్ టవర్ నిర్మించడంతో చిన్నారుల ఆరోగ్యం దెబ్బతింటుందని అనేక ఆరోగ్య సమస్యలతో పాటు రేడియేషన్ ప్రభావంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ అనుమతి లేకుండా గ్రామంలో ఖాళీ స్థలాలు ఉన్నప్పటికీ జనావాసాల మధ్య చేపట్టిన సెల్ టవర్ నిర్మాణాన్ని తక్షణం ఆపాలని స్థానిక సర్పంచ్ బానోత్ సరోజ డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ నిర్మాణంపై జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.