17-02-2026 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): నగర పౌరుల సమస్యలను నేరు గా పరిష్కరించేందుకు ఉద్దేశించిన ప్రజావాణి కార్యక్రమం సోమవారం మూడు ప్రధాన ము న్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోనూ జరిగింది. గ్రేటర్ హైదరాబాద్, మల్కాజిగిరి,సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల ప్రధాన కార్యాలయాలకు ప్రజలు తమ సమస్యలతో తరలివచ్చారు. ఆయా కార్పొరేషన్ల కమిషనర్లు స్వయంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, వాటిని తక్షణమే పరిష్కరిం చాలని సంబంధిత అధికారుల కు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు.
కాగాజీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ర్వహిం చిన ప్రజావాణిలో కమిషనర్ ఆర్వీ కర్ణన్ పాల్గొని అదనపు కమిషన ర్లు, ఇతర విభాగాధిపతులతో కలిసి ఆయన ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. హె డ్ ఆఫీస్ పరిధిలో మొత్తం 28 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కమిషనర్ కర్ణన్ మాట్లాడుతూ ప్రజా వాణిలో వచ్చే ప్రతి ఫిర్యాదుకు అధిక ప్రాధా న్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.
అందిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు సత్యనారాయణ, మంగతాయారు, విజిలెన్స్ ఏఎస్పీ నరసింహ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్, సీసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాగా మల్కాజిగిరి నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 15 ఫిర్యాదులుఅందాయి.
కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ప్రజల నుంచి ఫిర్యా దులు స్వీకరించారు. కొత్తగా ఏర్పడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనూ ప్రజావాణి మొత్తం 41 దరఖాస్తులు వచ్చాయి. ప్రజలు నేరుగా కార్యాలయానికి వచ్చి తమ ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో అన్ని శాఖ అధికారుల పాల్గొని, అర్జీలను స్వీకరించారు.