17 June, 2026 | 4:15 PM

చినలింగాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

17-06-2026 02:49 PM

తంగళ్ళపల్లి,జూన్17(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చినలింగాపూర్ గ్రామానికి చెందిన లావణ్య–ఆంజనేయులు దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిలో గృహప్రవేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింగం గౌడ్,మాట్లాడుతూ, ప్రజా పాలన ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.గతంలో సొంత ఇల్లు అనేది చాలా మంది పేద కుటుంబాలకు కలగానే ఉండేదని, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆ కలలు నిజమవుతున్నాయని వారు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన జీవనం కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందన్నారు. పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే ఈ పథకం ద్వారా వేలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి పంపించిన కానుకను స్థానిక సర్పంచ్ శ్యాగ విజయ దేవేందర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. తమకు సొంత ఇంటి కల నెరవేరినందుకు లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బైరవేణి మునిగల రాజు,రాము, గుగ్గిల శ్రీకాంత్ గౌడ్, మిర్యాల శ్రీనివాస్ యాదవ్,పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొని నూతన గృహ యజమానులను అభినందించారు.