టీపీఎస్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలకు తాళం వేయొద్దు
18-06-2026 12:00 AM
రామాయంపేట, జూన్ 17 : రాష్ట్ర వ్యాప్తంగా వంద టీపీఎస్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం రెండున్నరేళ్లలో ఒక్క పాఠశాల మాత్రమే ప్రారంభించడం వైఫల్యానికి నిదర్శనమని బీజేపీ నేత రాగి రాములు అన్నారు. ఒక్కో టీపీఎస్కు రూ.200 కోట్లు ఖర్చు చేసే బదులు ఆ నిధులను గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి వినియోగిస్తే వేలాది మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలే ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల లేమితో ఇబ్బందులు పడుతున్నాయని, గురుకులాలు ఇంకా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. టీపీఎస్ విధానాన్ని పునర్ సమీక్షించి ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతంపై దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు.






