19 May, 2026 | 5:57 PM

వర్షాకాలం పంటల సాగుపై తొందరపడవద్దు.

19-05-2026 04:51 PM

బోథ్,(విజయక్రాంతి): వర్షాకాలంలో పంటలను సాగు చేసే రైతులు తొందరపడవద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు కోరారు. మంగళవారం సోనాల మండలంలోని చింతల బోరి గ్రామంలో రైతు ముంగిట వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు చేశారు. భూమి పూర్తిస్థాయిలో తడవనిదే పంట పెట్టవద్దని సోయాబీన్ పత్తి మొక్కజొన్న జొన్న మొదలైన పంటల సాగుపై రైతులకు వివరించడంతోపాటు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల గురించి తెలిపారు నానో యూరియా వాడకం వల్ల కలిగే లాభాలను వివరించారు. వ్యవసాయ శాఖ పథకాల గురించి రైతులకు అవగాహన కలిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీరామ్ గైక్వాడ్ ఉప సర్పంచ్ దిగోలే విష్ణు శాస్త్రవేత్తలు డాక్టర్ సునీల్ కుమార్ జి దేవా నాయక్ ఉమా పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రైతులు పాల్గొన్నారు.