సుందరయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి
సిపిఎం మండల కార్యదర్శి తోటకూరి రాజశేఖర్
కూసుమంచి,(విజయక్రాంతి): భారత కమ్యూనిస్టు (మార్క్సిస్టు) మహానేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఎల్లప్పుడూ కార్మిక, కర్షక ,మధ్యతరగతి ప్రజల అభ్యన్నత కోసం నిరంతరం కృషి చసిన మహానేత పుచ్చలపల్లి సుందరయ్య ఆయన ఆశయాలను మనందరం ముందుకు తీసుకెళ్లాలని సిపిఎం మండల కార్యదర్శి తోటకూరి రాజశేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని పద్మా రెడ్డి భవనంలో పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధతి ఘనంగా నిర్వహించారు. ముందుగా సిపిఎం సీనియర్ నాయకులు శీలం గురుమూర్తి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తోటకూరి రాజశేఖర్ మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల కోసం, సామాన్యుల జీవితాల్లో మార్పు కోసం, సమానత్వం కోసం, సమాజంలో అంటరానితనం నిర్మూలన కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించి, ఆదర్శ మహానేత, తన యావదాస్తులను పేదవారికి పంచిన మహానేత సుందరయ్య, ఆ మహానుభావుడి ఆశయాలను మన ముందు తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లెల సన్మతరావు, పాలేరు డివిజన్ కమిటీ సభ్యులు బిక్కసాని గంగాధర్, నాయకులు ఎల్లంపల్లి అశోక్, పడిశాల శేషయ్య, ఎర్రబోయిన సురేష్, జవ్వాజి శ్రీను, ఉప్పయ్య, ఉన్నం బాబురావు, నవీన్, వీరబాబు, వీరన్న, నాగేశ్వరరావు, ప్రసాద్, వెంకటేశ్వరరావు, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు






