15 July, 2026 | 2:49 AM

బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రిని ఎత్తివేయొద్దు

09-06-2024 01:06 AM

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన

బెల్లంపల్లి, జూన్ 8 (విజయక్రాంతి): బెల్లంపల్లిలోని సింగరేణి ఏరియా ఆస్పత్రిని ఎత్తివేసే ఆలోచనను యాజమాన్యం విరమించుకోవాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసి కేంద్ర ఉపాధ్యక్షుడు మిట్టపల్లి వెంకటస్వామి మాట్లాడుతూ 1986లో ఎన్టీఆర్ హయాంలో ఈ ఆస్పత్రిని ప్రారంభించారని,  ఆ నాటి నుంచే యాజమాన్యం మూసివేతకు కుటిల ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. 

ఎని కుయుక్తులు పన్నినా  వాటిని తిప్పికొడతామన్నారు. ఐఏటీయూసీ బెల్లంపల్లి బ్రాంచి ఇంచార్జి చిప్పన ర్సయ్య మాట్లాడుతూ కొత్తగూడెం, రామగుండం, రామక్రిష్ణాపూర్, బెల్లంపల్లి ప్రాం తాల్లో కార్మికులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు యాజమాన్యం ఏరియా ఆస్ప త్రులను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులు, ఆయాలు, వార్డుబాయ్‌లు లేరని సంబంధిత ఏరియా జీఎంలతో పాటు సీంగరేణి సీ అండ్ ఎండికి ఎన్నో సా ర్లు విన్నవించినా స్పందించడం లేదన్నారు.

ఇప్పటికే ఆస్పత్రిలో అన్ని వార్డులను మూసివేసి క్యాజువాలిటీలో కొనసాగిస్తున్నార న్నారు. ఆందోళనలో ఏఐటీయూసి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేష్ , టౌన్ సెక్రటరీ ఆడెపు రాజమొగిళి, ఏరియా ఆసుపత్రి ఫిట్ సెక్రటరీ డీఆర్ శ్రీధర్,అసిస్టెంట్ సెక్రటరీలు పుట్ట శ్రీనివాస్, నంది అన్వేష్,ఆర్గనైజింగ్ సెక్రటరీలు కుంట ప్రకాష్ పాల్గొన్నారు.