15 July, 2026 | 2:38 AM

ప్రజల మధ్యే ఉంటా: ఆత్రం సుగుణ

09-06-2024 01:13 AM

నిర్మల్, జూన్ 8 (విజయక్రాంతి): ఎన్నికల్లో ఓటమి చెందినా తాను ప్రజల మధ్యే ఉంటానని కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ స్పష్టం చేశారు. ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లు పేర్కొన్నా రు. లోక్‌సభ ఎన్నికల్లో తనను రెండోస్థానంలో నిలబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు ప్రకటించారు.నిర్మల్ డిసిసీ అధ్యక్షుడు శ్రీహరిరావు నివాసంలో శనివారం ఆమె విలేక రులతో మాట్లాడారు.  ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ప్రజాతీర్పును గౌర విస్తూ.. నిత్యం వారి పక్షానే నిలబడతానని చెప్పారు. ఆమె వెంట మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, నాయకుడు రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు.