09-05-2025 12:53:31 AM
భారత్ మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యం లో పాక్ మూలాలున్న ఓటీటీ కంటెంట్‌ను పూర్తిగా నిలిపివేయాలని భారత సమాచార ప్రసార మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఓటీటీ ఫ్లాట్‌ఫాంలకు సూచనలు సైతం జారీచేస్తూ ప్రకటనను సైతం విడుదల చేసింది.
జాతీయ భద్రత దృష్ట్యా పాకిస్థాన్ మూలాలున్న ఓటీటీ కంటెంట్, వేదికలు, మీడియా స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాంలు, మధ్యవర్తిత్వం ద్వారా అఏ్య ఏ ప్రసారమైనా ఇక పూర్తిగా నిలిపివేస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొంది. పాకిస్థాన్ వెబ్‌సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు సహా మీడియా కంటెంట్ ఏదీ ఇక భారత్‌లో అందుబాటులో ఉండదని, సబ్‌స్క్రిప్షన్, సహా ఇతర మార్గాల ద్వారా కంటెంట్ పొందుతున్న వారికీ ఇందులో ఏ మినహాయింపూ లేదని స్పష్టం చేసింది.